ఏపీ పంచాయతీ ఎన్నికల బరిలోకి విద్యావంతులు దిగుతున్నారు. అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం వేచలం గ్రామానికి చెందిన 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గ్రీష్మనాయుడు రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె.. తన తండ్రి ఆర్కే నాయుడు సేవాస్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పారదర్శక పాలన అందిస్తానని, రాజకీయాలకు అతీతంగా తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు.