
ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్‌పై కాగ్నిజెంట్ చీఫ్ కీలక కామెంట్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల స్వరూపం మారుతోందని, కానీ అవి మాయం కావడం లేదని కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ రాజేష్ వారియర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది సంస్థ 24వేల నుంచి 25వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనుంది. AI వల్ల రొటీన్ పనులు ఆటోమేట్ అవుతాయని, అయితే ఉద్యోగులు AI అవుట్‌పుట్‌లను వెరిఫై చేయడం, విశ్లేషించడం వంటి కీలక బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కాగ్నిజెంట్ తన సిబ్బందిని AI నైపుణ్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణను కూడా అందిస్తోంది.




