మహిళా రిజర్వేషన్లు, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుల కోసం ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కేంద్రం డీఎంకే సహా ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాజ్యాంగ సవరణకు లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కావడంతో సంఖ్యాబలంపై కేంద్రం దృష్టి పెట్టింది. అక్టోబర్ 26, 27 తేదీల్లో జరిగే బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ను దృష్టిలో ఉంచుకుని సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.