‘ఓ.ఎమ్’ (O.M) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానికి నటి శ్రీలీల ఒక మర్చిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ వేడుకలో ఒక అభిమాని ఆటోగ్రాఫ్ కోసం స్లిప్ అందించాడు. శ్రీలీల చిరునవ్వుతో ఆటోగ్రాఫ్ ఇచ్చి, ఆ పేపర్‌పై ప్రేమగా ముద్దుపెట్టి తిరిగి అందించారు. ఈ ఊహించని సంఘటనతో సదరు అభిమాని ఎంతో సంతోషానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.