శ్రీనగర్‌లో మైనస్ 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు

1చూసినవారు
శ్రీనగర్‌లో మైనస్ 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు
చలి తీవ్రతతో జమ్మూకశ్మీర్‌ గజగజ వణుకుతోంది. శ్రీనగర్‌లో ఈ సీజన్‌లోనే అత్యంత చల్లని రాత్రి నమోదైంది. బుధవారం రాత్రి ఉష్ణోగ్రత మైనస్‌ 0.2 డిగ్రీలకు పడిపోయింది. పహల్గాంలో మైనస్‌ 2.8, గుల్మార్గ్‌లోనూ మైనస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుప్వారా, కాజీగుండ్‌, షోపియాన్‌ ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. ఈ నెలాఖరు వరకు పొడి వాతావరణం ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్