తెలంగాణలో SSC పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

40చూసినవారు
తెలంగాణలో SSC పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
2027 మార్చిలో నిర్వహించనున్న SSC, OSSC, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షా ఫీజు చెల్లింపు గడువును డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పొడిగించింది. విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులను ఈ నెల 27 వరకు పూర్తి చేయవచ్చు. అదనపు సమయం కోరుకునే వారి కోసం రూ.50 లేట్ ఫీజుతో DEC 8 వరకు, రూ.200 ఫీజుతో DEC 21 వరకు, రూ.500 ఫీజుతో 2027 JAN 4 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

సంబంధిత పోస్ట్