తమిళ నటి నివేదితా సతీష్ తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుంది. ఆమె ఫోటోగ్రాఫర్, వ్యాపారవేత్త సుహైబ్ మహమ్మద్తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. 'మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం' అని క్యాప్షన్తో నిశ్చితార్థం ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుకలో నివేదితా సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. ఆమె తెలుగులో 'హలో' సినిమాతో పాటు 'కెప్టెన్ మిల్లర్' వంటి పలు చిత్రాల్లో నటించారు.