
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రకు అస్వస్థత.. పరిస్థితి విషమం
పశ్చిమ బెంగాల్‌లోని హింగల్గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మొదట బసిర్హత్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్నారు. ఆమెపై విషప్రయోగం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




