సూపర్స్టార్ రజనీకాంత్ తన బస్ కండక్టర్ ఉద్యోగం నాటి రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘జైలర్ 2’ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు నెల్సన్తో జరిగిన చాట్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లపాటు కండక్టర్గా పనిచేసిన రోజులను ఇప్పటికీ మిస్ అవుతున్నానని తెలిపారు. బెంగళూరుకు వెళ్లిన ప్రతిసారీ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని, బస్సును చూసినప్పుడల్లా సంతోషం కలుగుతుందని చెప్పారు. తాను పెద్ద సూపర్స్టార్నని ఎప్పుడూ అనుకోలేదని, కండక్టర్గా పనిచేసిన రోజులపై తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు.