బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. తనకు భారీ స్థాయిలో భద్రత కల్పిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో ధైర్యంగా ఉండలేకపోతున్నానని వ్యాఖ్యానించినట్లు సమాచారం. భద్రతా ఏర్పాట్లు ఉన్నా ముప్పుపై ఆందోళన మాత్రం తొలగిపోలేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.