నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

9175చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్‌ 183.15 పాయింట్లు నష్టపోయి 77,472.94 వద్ద, నిఫ్టీ 126.80 పాయింట్లు పతనమై 24,207.75 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 30లో ఇన్ఫోసిస్‌, ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోగా, కోటక్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ లాభాల్లో ముగిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్