
ఆధార్ అథెంటికేషన్.. రేపటితో ముగియనున్న గడువు
AP: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఎల్పీజీ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ చేసుకునేందుకు బుధవారం గడువు ముగియనుంది. ఎల్పీజీతో ఆధార్ లింక్ చేసిన వారికే అక్టోబర్ 1 నుంచి రాయితీతో సిలిండర్ అందుతుంది. ఫేక్ కనెక్షన్లను తొలగించేందుకు కేంద్రం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. గ్యాస్ వినియోగదాలరు ఆయా కంపెనీల గ్యాస్ యాప్లు, డెలివరీ సిబ్బంది, గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఆధార్ లింక్ చేసుకోవచ్చు.




