AP: అర్నాబ్ తుఫాన్ ధాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం పాత గోశాల, బాలాజీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇద్దరు, కోనసీమ జిల్లాలో వృద్ధురాలు, వెంకాయమ్మ అనే మరో మహిళ గుడిసె కూలి మరణించారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో విద్యుత్ తీగలు తెగిపడటంతో మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది.