TG: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 21వ వార్డులో ఓ చిన్నారిపై వీధికుక్క దాడి చేసి కరిచింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల సంచారం పెరుగుతుందని, చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లాలన్నా భయపడాల్సి వస్తోందని వాపోతున్నారు. వీధికుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.