మహారాష్ట్రలోని పర్బానీ నగరంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. తాజాగా, స్థానిక ప్రాంతంలో సైకిల్‌పై పాఠశాలకు వెళ్తున్న ఓ బాలికను వీధి కుక్కల గుంపు వెంబడించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భయంతో బాలిక సైకిల్ తొక్కుతూ పరుగులు తీయగా, కుక్కలు ఆమెను వెంబడిస్తూ కొంతదూరం వరకు వెంటపడ్డాయి. సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.