ఫ్రాన్స్‌లో విద్యార్థుల విప్లవం.. అట్టుడుకుతున్న వీధులు

34చూసినవారు
పాఠశాలల్లో మెరుగైన వసతులు, టీచర్ల నియామకం వంటి డిమాండ్లతో ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. 15–18 ఏళ్ల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఉద్యమం వేగంగా విస్తరించింది. టీచర్ల కొరత, తరగతి గదుల్లో అధిక విద్యార్థులు, వేతనాల కోత ప్రతిపాదనలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలను అణచివేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టడంతో పలుచోట్ల హింస చెలరేగింది. దాదాపు 100 పాఠశాలలు ధ్వంసమయ్యాయని, 6,000 మందిని అరెస్ట్‌ చేశారని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్