పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్‌లో ఆందోళనల సమయంలో భారీ ఎత్తున చోరీలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు క్యాంపస్‌లోని మాల్తో పాటు జలంధర్ హైవేపై ఉన్న షాపులను లూటీ చేశారు. షాపుల యజమానులు తెలిపిన వివరాల ప్రకారం, లక్షల రూపాయల విలువైన ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, బట్టలు, షూలు దొంగిలించబడ్డాయి. అంతేకాకుండా, షాపుల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.