మసీదులో ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి

9చూసినవారు
పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కోహాట్‌ జిల్లాలో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఒక మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి మసీదు గోడ కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్