ప్రేమానంద మహారాజ్ శిష్యుడి ఆత్మహత్య

129చూసినవారు
ప్రేమానంద మహారాజ్ శిష్యుడి ఆత్మహత్య
యూపీలోని వృందావన్‌లో గురువారం సాయంత్రం ప్రేమానంద మహారాజ్ శిష్యుడు రసిక్ దులారీ శరణ్ (26) నాలుగో అంతస్తు నుంచి దూకి మృతి చెందారు. ఆయన కేలీ కుంజ్ ఆశ్రమంలోని గురుకృపా కుంజ్‌లో నివసిస్తున్నారు. మృతదేహంపై ప్రైవేట్ భాగంలో గాయాలు, తీవ్ర రక్తస్రావం గుర్తించినట్లు సమాచారం. గదిలో గ్రైండర్‌ కూడా లభించింది. దానితోనే గాయాలు చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఆయన జననాంగం కోసుకుపోయినట్లు తెలుస్తోంది. హత్య, ఆత్మహత్య రెండు కోణాల్లో పోలీసుల విచారణ సాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్