అంటార్కిటికా మంచు కింద 'సూపర్ మౌంటైన్స్'

18చూసినవారు
అంటార్కిటికా మంచు కింద 'సూపర్ మౌంటైన్స్'
అంటార్కిటికా మంచు పొరల కింద ఒకప్పుడు హిమాలయాలంత ఎత్తైన ప్రాచీన పర్వతాలు ఉండేవని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఏఎన్‌యూ, జర్మనీకి చెందిన జీఎఫ్‌జెడ్‌ పరిశోధకులు సముద్ర గర్భంలోని 1,712 జిర్కాన్‌ ఖనిజ రేణువులను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. 650-450 మిలియన్‌ ఏళ్ల క్రితం ఉన్న ఈ పర్వతాలు క్షీణించడంతో ఇనుము, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు సముద్రాల్లోకి చేరాయని తెలిపారు. దీంతో ఆక్సిజన్‌ పెరిగి, సుమారు 539 మిలియన్‌ ఏళ్ల క్రితం జరిగిన కేంబ్రియన్‌ విస్ఫోటనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పరిశోధకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్