రైతులకు లోన్లు ఇచ్చి అండగా ఉండండి: భట్టి

9చూసినవారు
రైతులకు లోన్లు ఇచ్చి అండగా ఉండండి: భట్టి
TG: ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన కరవు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, బ్యాంకులు వారికి అండగా నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంట రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు, రబీ సీజన్‌కు అవసరమైన కొత్త రుణాలను సకాలంలో అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా సామాన్యుల కోసం ఎడ్యుకేషన్, హోమ్ లోన్ల మంజూరులో బ్యాంకులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్