
తిరువణ్ణామలై ఆలయంలో అపచారం.. నంది వాహనంపైకి ఎక్కిన సిబ్బంది
పంచభూత క్షేత్రమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో నవంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న కార్తీక దీపోత్సవ పనులలో అపచారం జరిగింది. గురువారం నాడు ఆలయ గోపురాలను శుభ్రం చేస్తుండగా, అగ్నిమాపక సిబ్బంది పవిత్రమైన నంది వాహనంపైకి ఎక్కడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, దేవాదాయ శాఖ స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అశోక్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేసింది. తప్పును గుర్తించిన సిబ్బంది ఆలయ అధికారులకు రాతపూర్వక క్షమాపణ లేఖను సమర్పించారు.




