
ఉదయం పెళ్లి.. సాయంత్రానికి విడిపోయారు
కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట ఒక రోజైనా గడవకముందే విడిపోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లా కుళచ్చల్ ప్రాంతానికి చెందిన 31ఏళ్ల వయసున్న ఓ సైనికుడు, కన్యాకుమారి-కేరళం సరిహద్దు ప్రాంతమైన పారసాలై ప్రాంతానికి చెందిన 26ఏళ్ల యువతి పెద్దల సమక్షంలో గత సోమవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. సాయంత్రం వివాహ రిసెప్షన్ సమయంలో మద్యం మత్తులో ఉన్న వరుడు.. వధువు తండ్రితో గొడవపడ్డాడు. మామ, అడొచ్చిన భార్యపై చేయి చేసుకున్నాడు. అనంతరం తండ్రీకూతుళ్లు కుళచ్చల్ PSలో ఫిర్యాదు చేశారు. తర్వాత భర్తతో తెగదెంపులు చేసి కుమార్తెను తమ ఇంటికి తీసుకెళ్లారు.






































