
పాత కక్షల నేపథ్యంలో బతుకమ్మ సంబరాల్లో కత్తిపోట్లు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బతుకమ్మ సంబరాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీజే డ్యాన్స్ లు వేస్తుండగా పాత కక్షల నేపథ్యంలో సంతోష్ అనే వ్యక్తి మరొకరిపై దాడికి ప్రయత్నించగా, అడ్డు వెళ్లిన లింగరాజుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో లింగరాజు చెవి కింద తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
























