Oct 16, 2026, 13:10 IST/కోదాడ నియోజకవర్గం
కోదాడ నియోజకవర్గం
పేద మహిళలకు చీరలు పంపిణీ అభినందనీయం.. డీఎస్పీ
Oct 16, 2026, 13:10 IST
సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయపూడి ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో రంగా థియేటర్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య ఈ సేవా కార్యక్రమాలను అభినందించారు. పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.