Sep 25, 2026, 08:09 IST/
భర్త నల్లగా ఉన్నాడని ఎగతాళి.. విడాకులు ఇవ్వలేమన్న కోర్టు
Sep 25, 2026, 08:09 IST
ఛత్తీస్గఢ్ హైకోర్టు భర్త నల్లగా, లావుగా ఉన్నాడనే కారణంతో విడాకులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. భర్త దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, కేవలం ఈ ఆరోపణల ఆధారంగా వివాహాన్ని రద్దు చేయడం కుదరదని, భార్య వేధింపులకు గురిచేసిందనడానికి బలమైన ఆధారాలు లేవని జస్టిస్ పార్థ ప్రతీమ్ సాహు, జస్టిస్ సచిన్ సింగ్ రాజ్పుత్ల బెంచ్ స్పష్టం చేసింది. జంజ్గిర్-చంపా జిల్లాకు చెందిన ఈ దంపతుల వివాదంపై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల నిరాకరణ తీర్పును హైకోర్టు సమర్థించింది.