
ప్రతిష్ఠాపనకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలో దేవీ ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన స్థలంపై రెండు రాజకీయ పార్టీల వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వివాదం కారణంగా, ప్రతిష్ఠాపనకు ముందే అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయాల్సి వచ్చింది. పూజలు నిర్వహించకుండానే విగ్రహాన్ని నిమజ్జనం చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.























