
ఎన్సీఎల్ పరిశ్రమ బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్సీఎల్ పరిశ్రమకు సంబంధించిన బస్సు ఢీకొనడంతో రిక్షా కార్మికుడు పిట్టల రమణ (70) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం నెలకొంది. రిక్షా కార్మికుడు మృతి చెందడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

























