Sep 06, 2026, 10:09 IST/
'మందాడి' మూవీపై డైరెక్టర్ శివ నిర్వాణ ప్రశంసలు
Sep 06, 2026, 10:09 IST
హైదరాబాద్లో జరిగిన 'మందాడి' ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడారు. తమిళ నటుడు సూరి నటనను, సుహాస్ నటనను ఆయన ప్రశంసించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డులు, ఆస్కార్ స్థాయికి వెళ్లినా ఆశ్చర్యం లేదని శివ నిర్వాణ అన్నారు. ఈ మూవీ సముద్రం, మత్స్యకారుల బోట్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కగా, సూరి హీరోగా, సుహాస్ విలన్గా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మధిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు.