కోదాడ నియోజకవర్గం - Kodad Constituency

పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఖాసీం

పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా షేక్ ఖాసీం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన కొదాడ మండలం తమ్మర ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత 28 ఏళ్లుగా పీఆర్‌టీయూ సంఘంలో మండల, జిల్లా స్థాయిల్లో పలు పదవులు నిర్వహిస్తూ సంఘం అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న ఖాసీం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, మిత్రులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

వీడియోలు

సూర్యాపేట జిల్లా
పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఖాసీం
Oct 16, 2026, 11:10 IST/కోదాడ నియోజకవర్గం
కోదాడ నియోజకవర్గం

పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఖాసీం

Oct 16, 2026, 11:10 IST