Sep 23, 2026, 16:09 IST/
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి: బీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం
Sep 23, 2026, 16:09 IST
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. 2027 మార్చి నాటికి ఖాళీ కానున్న ఈ స్థానాల కోసం బీఆర్ఎస్ గెలుపుపై దృష్టి పెట్టింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాల్లో పాగా వేయాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని, ఒక సీటును ఓసీకి, మరొకటి బీసీకి కేటాయించే దిశగా సమాలోచనలు జరుగుతున్నాయని సమాచారం.