
కోరిక తీర్చకపోతే నీ భర్తను చంపేస్తా అంటూ కాంగ్రెస్ నాయకుడి వేధింపులు
సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఏడాది కాలంగా ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె న్యూడ్ ఫోటోలు తీసి, సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ, కోరిక తీర్చకపోతే భర్తను చంపేస్తానని అసభ్యకర మెసేజ్లు చేశాడని బాధితురాలు తెలిపింది . రాజకీయ నాయకులు, పోలీసుల అండ ఉందని కూడా అతను బెదిరించినట్లు బాధితురాలు కన్నీరుమున్నీరైంది.













