Sep 23, 2026, 16:09 IST/
కళింగపట్నం తీరానికి తాకిన తీవ్ర వాయుగుండం
Sep 23, 2026, 16:09 IST
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (అర్నాబ్ తుఫాన్) శ్రీకాకుళం తీరానికి అత్యంత చేరువలో వచ్చింది. వజ్రపుకొత్తూరు-భోగాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. సంతబొమ్మాళి మండలం కరిపేట బీచ్ వద్ద ల్యాండ్ ఫాల్ సూచనలున్నాయి. కళింగపట్నానికి నైరుతి సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకింది. మరో గంటలో తీరాన్ని పూర్తిగా దాటనుంది. గంటకు 60-70 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీయనుంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.