
అమెరికాలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు మృతి
నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన సాయితేజ (25) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల కుమారుడైన సాయితేజ ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. వారం రోజుల క్రితమే అతనికి ఉద్యోగం లభించింది. ప్రయాణిస్తున్న కారు జింకను ఢీకొట్టడంతో ఆగిపోయింది. ఆ సమయంలో వెనుక నుండి వచ్చిన వాహనాలు సాయితేజ కారును బలంగా ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.




















