
టిప్పర్ ఢీకొని మహిళ మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం గ్రామంలో జరిగిన ప్రమాదంలో చింతల మంజుల (45) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. దసరా పండుగ సందర్భంగా వర్కట్ పల్లి లోని పుట్టింటికి భర్తతో వచ్చిన ఆమె, తిరుగు ప్రయాణంలో స్కూటీపై వెళుతుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.




















