Oct 09, 2026, 14:10 IST/
కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Oct 09, 2026, 14:10 IST
TG: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మినుగా వెంకటేష్ (27), బీచుపల్లిలోని 10వ బెటాలియన్లో TGSP కానిస్టేబుల్గా (నెంబర్ 664, 2024 బ్యాచ్) విధులను నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఎర్రవల్లి చౌరస్తాలోని తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.