నూతనకల్ మండలం - Vikarabad

సూర్యాపేట జిల్లా
Oct 08, 2026, 12:10 IST/

మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో

Oct 08, 2026, 12:10 IST
బీహార్‌ మొకామా జేడీయూ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ మరోసారి తనదైన శైలితో వార్తల్లో నిలిచారు. బెడ్‌పై పడుకున్న ఆయనకు ఓ పూజారి నుదుటిపై తిలకం దిద్దారు. అయితే తనను వీడియో తీస్తున్నారని గమనించిన వెంటనే మంచం దిగి నిల్చున్నారు. అనంతరం పూజారి ఆయనకు పూలమాల వేయగా, మరికొందరు శాలువాలు కప్పారు. ఓ వ్యక్తి ఇచ్చిన నల్ల కళ్లద్దాలను ధరించిన అనంత్‌ సింగ్‌ ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన తీరుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.