
మరణించిన ఉపాధ్యాయురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
సూర్యాపేట జిల్లాలో తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పిల్లలమర్రి కళింగం ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన ఉపాధ్యాయురాలు బూర చంద్రకళ మేడమ్ జ్ఞాపకార్థం, వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల సహకారంతో రూ.9,000 ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు శుక్రవారంఅందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇటుకుల సైదులు, ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి ఉపేంద్ర గౌడ్, కమిటీ సభ్యులు వెంకన్న సార్, లక్ష్మణ్, నాగరాజ్ సార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయం అకాల మరణం చెందిన తోటి ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచింది.






























