
ఏపూరి ఫౌండేషన్ పేద కుటుంబానికి ఆర్థిక సాయం
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గంలో అకాల మరణం చెందిన బొల్లెడ్ల పరశురాములు అనే నిరుపేద కుటుంబానికి ఏపూరి ఫౌండేషన్ అండగా నిలిచింది. దశదిన కర్మ రోజున, ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఏపూరి సోమన్న ఆదేశాల మేరకు బుధవారం 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సహాయాన్ని అందించిన ఏపూరి ఫౌండేషన్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోఆర్డినేటర్ గిలకత్తుల రమేష్ గౌడ్, బాలెంల మల్లేష్, కందుకూరి పరశురాములు, అల్వాల నవీన్, మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

























