ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోపై మరోసారి సస్పెన్స్

862చూసినవారు
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోపై మరోసారి సస్పెన్స్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 13న వీరి భేటీ ఫొటో బయటకు వచ్చినా, అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రకటన వెలువడింది. దీంతో ఈ పౌరాణిక చిత్రం 2027 జూలై నుంచి షూటింగ్ ప్రారంభం కావొచ్చని సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' పనుల్లో ఉన్నారు. దీనిని జూన్ 11న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు త్రివిక్రమ్, చిరంజీవితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోపై మరోసారి సస్పెన్స్ నెలకొంది.

సంబంధిత పోస్ట్