
డీఏ పెంపుతో ఎంత జీతం పెరుగుతుందో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం డీఏను 3% మేర పెంచి 53%కి చేర్చింది. దీనివల్ల బేసిక్ పే ఆధారంగా ఉద్యోగుల నెలవారీ వేతనం రూ.540 నుంచి రూ.1,683 వరకు పెరగనుంది. బేసిక్ పే రూ.18,000 ఉన్న లెవెల్-1 ఉద్యోగులకు రూ.540, రూ.35,000 ఉన్న మిడ్-లెవెల్ ఉద్యోగులకు రూ.1,062, అలాగే రూ.56,100 బేసిక్ పే ఉన్న లెవెల్-10 ఉద్యోగులకు రూ.1,683 మేర లబ్ధి చేకూరుతుంది. అయితే, పీఎఫ్, పన్ను మినహాయింపుల వంటి సర్దుబాట్ల వల్ల చేతికి వచ్చే నికర జీతంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉండవచ్చు.




