ఇంద్ర భగవాన్‌పై చర్యలు తీసుకోండి

22చూసినవారు
ఇంద్ర భగవాన్‌పై చర్యలు తీసుకోండి
ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. హర్దోయ్‌ జిల్లాకు చెందిన సూరజ్‌ తివారీ అనే వ్యక్తి, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిపిస్తున్న ఇంద్రుడిపై అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. ఇంద్రదేవుడికి తగు ఆదేశాలు జారీ చేసి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదు నెట్టింట వైరల్‌గా మారింది. వర్షాల సంబంధిత ఘటనల్లో యూపీ వ్యాప్తంగా 56 మంది మృతి చెందగా, హర్దోయ్‌ జిల్లాలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 330కుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి.

సంబంధిత పోస్ట్