టాటా గ్రూప్ దిగ్గజ సంస్థ
టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వెహికిల్స్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి తమ కార్లు, ఎలక్ట్రిక్ (EV) లలో ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్లను బట్టి గరిష్ఠంగా రూ. 25 వేల వరకు పెంచుతామని స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉత్పత్తి, ముడిసరుకుల వ్యయాల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ సంస్థలు తమ కార్ల రేట్లు పెంచాయి.