హీరో దినేష్ తేజ్, దష్విక.కె జంటగా అర్జున్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తత్వం’. శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజాగ్ కు చెందిన హీరోయిన్ దష్విక.. ఈ సినిమాతో నటిగా పరిచయం కావడం సంతోషంగా ఉందని, తన పాత్రలో గ్రే షేడ్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని తెలిపారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మర్డర్ మిస్టరీలో సస్పెన్స్, ఎమోషన్ ఆకట్టుకుంటాయని ఆమె అన్నారు.