
యూపీఐ ఛార్జీలపై అమెరికా ఒత్తిడి.. కాంగ్రెస్ ఆరోపణలు
అక్టోబర్ 15 నుంచి యూపీఐ (UPI) లావాదేవీలపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రూ.2,000 దాటిన వ్యాపార చెల్లింపులపై 0.4% మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తించనుంది. అయితే, ఈ ఛార్జీలు వినియోగదారుల నుంచి కాకుండా వ్యాపారుల నుంచే వసూలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక అమెరికా ఒత్తిడి ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.




