ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా కెప్టెన్గంజ్లో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ పాఠశాలలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు రూపాలి, తన పాఠశాలలోని 11వ తరగతి విద్యార్థితో సన్నిహితంగా మారి అతనితో కలిసి పరారైంది. విద్యార్థి ఆచూకీ తెలియకపోవడంతో, అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు రూపాలిపై కిడ్నాప్, పోక్సో (POCSO) చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారిద్దరి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు.