టీమ్
ఇండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో రెండో
టీ20 మ్యాచ్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్వయంగా వెల్లడించారు. గురువారం జరిగిన తొలి T20లో కిషన్ గాయపడ్డారు. దీంతో ఆయన అందుబాటులో లేకపోవడం జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామంతో ఇషాన్ స్థానంలో వైభవ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని క్రీడావర్గాలు భావిస్తున్నాయి.