రాయ్పూర్లో
భారత్, జింబాబ్వే మహిళా జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ స్మృతి మంధాన తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మృతి మంధాన సారథ్యంలో
భారత్ ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఈ కీలక పోరులో టీమిండియా బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.