అనుమానాస్పద స్థితిలో టెక్కీ మృతి

36చూసినవారు
అనుమానాస్పద స్థితిలో టెక్కీ మృతి
హైటెక్ సిటీ కొండాపూర్‌లోని వీ వీ హైట్స్‌లో సౌరభ్ శేఖర్ (36) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన సౌరభ్, మరుసటి రోజు ఉదయం నుంచి స్పందించలేదు. సోదరుడు వెళ్లి చూడగా, ఫ్లాట్ నంబర్ 402లో విగతజీవుడిగా కనిపించారు. గత పదేళ్లుగా భోజనం చేసిన ప్రతిసారీ కడుపునొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదు చేసినా, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్