TG: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురం చౌరస్తా వద్ద శుక్రవారం తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ప్రమాదం జరిగింది. తిరుమలగిరి వైపు వెళ్తున్న ఆయన ప్రయాణిస్తున్న టయోటా కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో, ఆ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆల్ట్రోజ్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లన్నకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆల్ట్రోజ్ కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.